Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షారుక్ ఖాన్‌ను వెన‌క్కి నెట్టిన శోభితా ధూళిపాళ్ల.. అరుదైన ఘ‌న‌త‌!

Sobhita Dhulipala beats Shah Rukh Khan
Advertisement
  • ఈ వారం ఐఎండీబీ ఇండియ‌న్ పాప్యుల‌ర్ సెల‌బ్రిటీల జాబితాలో దూసుకెళ్లిన శోభిత‌
  • బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌ను వెన‌క్కి నెట్టి రెండో స్థానం సొంతం
  • ఈ జాబితాలో అగ్ర స్థానంలో బాలీవుడ్ నటి శార్వరీ వాఘ్
Advertisement
హీరో అక్కినేని నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత‌ నటి శోభితా ధూళిపాళ్ల గురించి తెలుసుకోవడానికి నెటిజ‌న్లు గూగుల్‌లో ఎక్కువ‌గా సెర్చ్ చేశారు. దీతో ఆమె ఈ వారం ఐఎండీబీ ఇండియ‌న్ పాప్యుల‌ర్ సెల‌బ్రిటీల జాబితాలో ఒక్క‌సారిగా పైకి ఎగ‌బాకారు. ఏకంగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌ను వెన‌క్కి నెట్టి రెండో స్థానం సొంతం చేసుకున్నారు. 

కాగా, ఈ జాబితాలో బాలీవుడ్ నటి శార్వరీ వాఘ్ అగ్ర స్థానంలో నిలిచారు. ముంజ్యా మూవీ విజయంతో ఆమె క్రేజ్ అమాంతం పెర‌గ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఇక షారూక్ మూడో స్థానం ద‌క్కించుకున్నారు. కింగ్ ఖాన్ త‌ర్వాత నాలుగు, ఐదు స్థానాల్లో వ‌రుస‌గా కాజోల్‌, జాన్వీ క‌పూర్ ఉన్నారు. 

అలాగే పారిస్ ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శన చేసిన బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్, బాలీవుడ్ నటి దీపికా పదుకొణె, 'మహారాజ'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విజయ్ సేతుపతి, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, ఐశ్వర్య రాయ్ టాప్-10లో చోటు సంపాదించుకున్నారు.

ఇదిలాఉంటే.. కుటుంబ సభ్యుల సమక్షంలో గత గురువారం చైతు, శోభిత‌ల‌ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ సడెన్ ఎంగేజ్‌మెంట్ తర్వాత శోభిత మరింత హాట్ టాపిక్ గా మారారు. ఇక‌పోతే శోభిత, చైతన్యలు త‌మ రిలేష‌న్‌ను చాలా గోప్యంగా ఉంచారు. ఎక్క‌డా కూడా త‌మ బంధాన్ని బ‌య‌ట‌పెట్ట‌లేదు. 

అయితే, 2023లో లండన్‌లో ఈ జంట‌ దిగిన వెకేషన్ ఫొటో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చి బాగా వైరల్ అయింది. కానీ చైతన్య, శోభిత దీనిపై ఎప్పుడూ స్పందించలేదు. ప్ర‌స్తుతం ఆమె 'సితార' అనే బాలీవుడ్ మూవీలో నటిస్తున్నారు. ఆమధ్య ఆమె 'మంకీ మ్యాన్' చిత్రంలో నటించారు. అలాగే డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ది నైట్ మేనేజర్‌'లోనూ క‌నిపించారు. ఇక నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటీ దర్శకత్వంలో 'తండేల్' చిత్రం చేస్తున్నారు.
Advertisement
Advertisement
Sobhita Dhulipala
Shah Rukh Khan
IMDB
Naga Chaitanya

More Telugu News